మెట్రో కబుర్లు

July 06, 2018
img

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద నేటి నుంచి యాక్టివా స్కూటీలు అద్దెకు లభిస్తాయి. మొదటిదశలో ఫెడల్, జూమ్ కార్ సంస్థలతో కలిసి మియాపూర్, కె.పి.హెచ్.బి., కూకట్ పల్లి, బేగంపేట, పరేడ్ గ్రౌండ్స్, నాగోలు స్టేషన్లవద్ద కార్లు, ద్విచక్రవాహనాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈరోజు మరో 125 యాక్టివా స్కూటీలను బాలానగర్, కూకట్ పల్లి, ప్రకాష్ నగర్, తార్నాక, మెట్టుగూడ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచారు.

వీటిని వినియోగించుకోదలచుకున్నవారు ముందుగా www.drivezy.com లో తమ పేరు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వగైరా వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. దానిద్వారా వాహనాన్ని బుక్ చేసుకొని సమీప మెట్రో స్టేషన్ నుంచి వాహనాన్ని తీసుకువెళ్ళవచ్చు.

ఈ వాహనాలకు కిమీకు రూ.3 చొప్పున అద్దె చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ 5 కిమీల కంటే తక్కువ దూరం ప్రయాణించిన కనీసం 5కిమీలకు రూ.15 అద్దె చెల్లించవలసి ఉంటుంది. అదే..నెలరోజులు ఉపయోగించుకోదలిస్తే రూ.2700 అద్దె చెల్లించవలసి ఉంటుంది. ప్రజాధారణను బట్టి ఈ అద్దె వాహనాల సంఖ్యను మున్ముందు మరింత పెంచుతామని హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి చెప్పారు. అదేవిధంగా పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు వాహనాల అద్దెలలో మార్పులు ఉంటాయని చెప్పారు. త్వరలో ఏడు రోజులకు, 15 రోజులకు పాసులు ఏర్పాటు చేస్తామని ఎన్.వి.ఎస్.రెడ్డి చెప్పారు.

కార్లు, ద్విచక్రవాహనాలకు అద్దె నామమాత్రంగానే ఉంది కనుక సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ వంటి మహానగరంలో ఈవిధంగా ఎక్కడికక్కడ అద్దెవాహనాలు లభిస్తే ప్రజలందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. 

Related Post