త్వరలో జియో ఫోన్-2 మార్కెట్లలోకి విడుదల

July 05, 2018
img

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన జియో ఫీచర్ ఫోన్ లకు విపరీతమైన ప్రజాధారణ లభిస్తోంది. అందుకు ప్రధానకారణం రూ.49 నామమాత్రపు ధరకే 28 రోజులు అపరిమిత కాల్స్ చేసుకొనే సౌకర్యం కల్పించడమే. అందుకే జియో ఫీచర్ ఫోన్ ను కేవలం పేదప్రజలే కాక బడావ్యాపారస్తుల వరకు అందరూ చాలా విరివిగా వాడుతున్నారు. దానిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉన్నప్పటికీ బేసిక్ మోడల్ కావడం వలన వాట్స్ అప్ వంటి కొన్ని అత్యవసరమైన యాప్స్ జోడించుకొనే సౌకర్యం లేదు. కనుక ఆ లోపాన్ని కూడా అధిగమించేందుకు ఫీచర్ ఫోన్స్ స్థానంలో జియో ఫోన్-2ను ఈరోజు అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. దాని ధర రూ.2,999. కానీ ‘మాన్ సూన్ హంగామా’ పేరుతో రూ.501లకే పాత ఫీచర్ ఫోన్ వాపసు చేసి ఈ కొత్త ఫోన్ పొందవచ్చు. ఈ కొత్త ఫోన్స్ లోయూట్యూబ్, ఫేస్ బుక్, వాట్స్ అప్ వంటి అన్ని యాప్స్ ఉంటాయి. 

జియో ఫోన్-2 వివరాలు:

డిస్ ప్లే: 2.5 అంగుళాలు, క్వెర్టీ కీ-ప్యాడ్, ఆపరేటింగ్ సిస్టం:కె.ఓ.ఎస్., ర్యామ్: 512ఎంబి, ఇంటర్నల్ స్టోరేజ్:4జిబి (మైక్రో ఎస్డి కార్డు ద్వారా 128జిబి వరకు పెంచుకోవచ్చు), బ్యాటరీ: 2000 ఎం.హెచ్.ఏ., కనెక్టివిటీ: 4జి వోల్టీ, వాయిస్ ఓవర్ వైఫై, జిపీస్, బ్లూ టూత్, ఎన్.ఎఫ్.సి., ఎఫ్.ఎం.రేడియో, ఫ్రంట్ కెమెరా: విజిఏ సెన్సార్, బ్యాక్ కెమెరా: 2 మెగా పిక్సెల్. 

ఈ ఫోన్లో రెండు సిమ్ కార్డ్స్ సౌకర్యం కల్పించింది. వాటిలో ప్రైమరీ సిమ్ కార్డ్ స్లాట్ జియో కార్డుతో లాక్ చేయబడి ఉంటుంది. రెండవ స్లాట్ లో వేరే ఏ కంపెనీ సిమ్ కార్డునైనా వేసి వాడుకోవచ్చు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ జియో ఫోన్-2 అమ్మకాలు ప్రారంభం అవుతాయి. 

Related Post