జియో గిగాఫైబర్ ప్రారంభం

July 05, 2018
img

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న జియో తాజాగా బ్రాడ్ బ్యాండ్ సేవల రంగంలోకి కూడా ప్రవేశించింది. రిలయన్స్ సంస్థ 41వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు ‘జియో గిగా ఫైబర్’ పేరిట ఏర్పాటు చేసిన బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వారు ప్రకటించారు. ఇంతవరకు దేశంలో బ్రాడ్ సంస్థలు గరిష్టంగా 100 ఎంబిపిఎస్ స్పీడుతో బ్యాండ్ సేవలు అందిస్తున్నాయి. జియో గిగాఫైబర్ పేరులోనే అది ఎంత వేగంగా పనిచేస్తుందో తెలియజేస్తోంది. ఈ రంగంలో ప్రవేశిస్తున్న జియో గిగాఫైబర్ దానికి 10 రెట్లు వేగంతో అంటే 1024 ఎంబి లేదా ఒక గిగాబిట్ వేగంతో సేవలు అందించబోతోంది. కనుక ఇక బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థలు కూడా జియోతో పోటీగా ఇప్పుడు ఇస్తున్న ధరల కంటే తక్కువ ధరకు ఎక్కువ స్పీడుతో సేవలు అందించవలసి వస్తుంది లేదా దుఖాణాలు మూసుకోకతప్పదు. 

ఈ జియో గిగాఫైబర్ సేవలతో ఇంటర్నెట్ వినియోగమే కాకుండా టీవీ కాలింగ్, స్మార్ట్ హోం టెక్నాలజీలను కూడా వినియోగించుకోవచ్చు. జియో గిగాఫైబర్ సేవలు పొందేందుకు జియో.కాం లేదా మైజియో మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. 

Related Post