బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.2,982 కోట్లు కుంభకోణం

June 21, 2018
img

దేశంలో ప్రజలు ఇప్పటికే బ్యాంకులపై నమ్మకం కోల్పోయారు. బ్యాంకులలో డబ్బు దాచుకుంటే దానిని ఎవరో దోచుకుపోతారనే భయం, అనుమానం ఏర్పడింది. ఆ అనుమానాలు, భయాలు నిజం చేస్తూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మరో బారీ కుంభకోణం బయటపడింది. ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ రవీంద్ర మరాటే, బ్యాంక్ డైరెక్టర్ ఆర్.కె.గుప్తా, ఆ బ్యాంక్ మాజీ సిఎండి సుశీల్ మునోత్ ముగ్గురూ డి.ఎస్.కె. గ్రూప్ అనే సంస్థతో కుమ్మక్కయి దానికి రూ.2,892 కోట్లు రుణాలు మంజూరు చేసి, ఉద్దేశ్యపూర్వకంగానే ఆ సొమ్ము ఎగవేతకు సహకరించారని ఆరోపిస్తూ ఆర్ధిక నేరాల దర్యాప్తు విభాగం వారిని అరెస్ట్ చేసింది. వారు ముగ్గురూ డి.ఎస్.కె. గ్రూప్ కు బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించి, ఆ సంస్థకు రుణాల మంజూరు చేసి, దాని ఎగవేతకు సహకరించారని ఆర్ధిక నేరాల దర్యాప్తు విభాగం ఆరోపించింది.

ఈ మోసానికి పాల్పడిన డి.ఎస్.కె. గ్రూప్ అధినేత డి.ఎస్.కులకర్ణి, అయన భార్య హేమంతి కులకర్ణిలతో సహా ఆ సంస్థకు చెందిన నిత్యానంద్ దేశ్ పాండే, చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ ఘనపాండేలను కూడా ఆర్ధిక నేరాల దర్యాప్తు విభాగం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేసింది. వారికి సంబందించిన 124 స్తిరాస్తులను, 276 బ్యాంక్ ఖాతాలను, 46 వాహనాలను కూడా జప్తు చేసి వారందరిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర మొదలైన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. 


Related Post