జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్

June 12, 2018
img

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులను ఆకట్టుకొంటూనే, ఇంకా కొత్తవారిని కూడా ఆకర్షించేందుకు చాలా ఆకర్షణీయమైన ప్లాన్లు, ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా జియో తన ప్రీ-పెయిడ్ వినియోగదారులకు రోజుకు అధనంగా 1.5 జిబిని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ జూన్ నెలాఖరు వరకు మాత్రమే అమలులో ఉంటుందని చెప్పడం కాస్త నిరాశ కలిగిస్తుంది. నేటి నుంచే ప్రత్యామ్నాయంగా, కొత్త వినియోగదారులు అందరికీ అధనంగా 1.5 జిబిని ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. తాజాగా 3 నెలల కాలపరిమితి కలిగిన రూ.499 ప్లాన్ ఒకటి ప్రకటించింది. దీనిలో రోజుకు 3.5 డాటా లభిస్తుంది. 

ఈరోజు జియో ప్రకటించిన డబుల్ ధమాకా ఆఫర్ వర్తించే ప్లాన్లు:

రూ.149,349,399,449 ప్లాన్స్ కు నేటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజుకు 3 జిబి డేటా లభిస్తుంది. 

రూ.198, 398,448,498 ప్లాన్స్ కు నేటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజుకు 3.5 జిబి డేటా లభిస్తుంది.

రూ.299 ప్లాన్ తీసుకున్నవారికి నేటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజుకు 4.5 జిబి డేటా లభిస్తుంది.

రూ. 509ప్లాన్ తీసుకున్నవారికి నేటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజుకు 5.5 జిబి డేటా లభిస్తుంది.

రూ. 799 ప్లాన్ తీసుకున్నవారికి నేటి నుంచి ఈ నెలాఖరు వరకు రోజుకు 6.5 జిబి డేటా లభిస్తుంది.

ఇవికాక రూ.300 అంతకంటే ఎక్కువ మొత్తానికి రీ ఛార్జ్ చేయించుకున్నట్లయితే నేరుగా రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది. రూ.300 కంటే తక్కువ మొత్తాలకు 20 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే వీటిని పొందేందుకు మైజియో యాప్, పేటిఎం, లేదా ఫోన్ పే ద్వారా చార్జింగ్ చేసుకోవలసి ఉంటుంది. 

Related Post