మెట్రో కబుర్లు

May 09, 2018
img

మరో రెండు నెలలోగా అమీర్ పేట నుంచి ఎల్.బి.నగర్ మెట్రో కారిడార్ లో అన్ని నిర్మాణపనులు, ట్రయల్ రన్స్ అన్నీ పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ లో మొత్తం 16 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఓఎంసి, ఎం.జి.బి.ఎస్. మలక్ పేట, న్యూ మార్కెట్, మూసారాం బాఘ్, దిల్ షుక్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్.బి.నగర్ వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే మియాపూర్-అమీర్ పేట-ఎల్.బి.నగర్-నాగోల్ వాసులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారిడార్ కూడా అమీర్ పేట ఇంటర్ చేంజ్ స్టేషన్ తో అనుసంధానం అవుతున్నందున అమీర్ పేట స్టేషన్ లో ఇంకా రద్దీ పెరగడం ఖాయం. 


Related Post