మెట్రో కబుర్లు

April 20, 2018
img

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒక శుభవార్త. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాలలో ప్రతీ 7 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుస్తాయని మున్సిపల్ మంత్రి కేటిఆర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. రద్దీ తక్కువగా ఉన్న సమయాలలో మాత్రం 8 నిమిషాలకు ఒక మెట్రో రైల్ నడుస్తుందని తెలియజేశారు. మియాపూర్ నుంచి నాగోల్ వరకు గల రెండు కారిడార్స్ లో ఇదే పద్దతిలో  మెట్రో రైళ్ళు నడుస్తాయని మంత్రి కేటిఆర్ తెలిపారు.

మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్నవారు ఈ వార్త కోసం గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మెట్రో రైల్ చాలా సౌకర్యంగా ఉన్నప్పటికీ, 15 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తుండటం వలన రద్దీ ఎక్కువగా ఉంటోంది. గమ్యస్థానాలు చేరుకోవడం ఆలస్యం అవుతోంది. కనుక ఇది వారికి శుభవార్తేనని చెప్పవచ్చు. అయితే ఇంకా రైళ్ళ వేగం పెంచడం, మంత్లీ పాసులు, స్టేషన్లలో త్రాగునీరు, పార్కింగ్ సౌకర్యాల కోసం మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలాలేవు. 


Related Post