మెట్రో 100 డేస్ రిపోర్ట్

March 19, 2018
img

నవంబర్ 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొదటి వంద రోజుల్లో సుమారు 80 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారని ఎల్&టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ అధికారులు తెలియజేశారు. ఫిభ్రవరి నెలాఖరు వరకు మియాపూర్-అమీర్ పేట, నాగోల్-అమీర్ పేట రెండు మార్గాలలో కలిపి మెట్రో రైళ్ళు మొత్తం 36,186 ట్రిప్స్ తిరిగాయని, 10.2 లక్షల కిమీ దూరం ప్రయాణించాయని అధికారులు తెలిపారు. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ క్రమంగా పెరుగుతోందని చెప్పారు. సమయపాలన, సౌకర్యవంతమైన ప్రయాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రయాణికుల భద్రత మొదలైన కారణాల చేత ఇప్పుడు ఎక్కువ మంది మెట్రో రైల్ సర్వీసు లను వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని అన్నారు. మిగిలిన రూట్లలో కూడా మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆశిస్తున్నామని ఆ సంస్థ అధికారులు చెప్పారు. 


Related Post