షియోమి సరికొత్త ఆఫర్

March 16, 2018
img

భారత మొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న చైనా మొబైల్ కంపెనీ షియోమి తన మార్కెట్ ను మరింత విస్తరించుకొనేందుకు కొత్తగా ఎంఐ ఎక్స్చేంజ్ పధకాన్ని ప్రవేశపెట్టింది. మీ పాత ఫోన్ కు మంచి ధర చెల్లించి తీసుకొని మీరు ఎంచుకొనే ఎంఐ కొత్తఫోనులో దానిని తగ్గిస్తుంది. దీనికోసం ముందుగా మీరు ఎంఐ.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న 15 మోడల్స్ ఫోన్స్ లో మీరుపయోగిస్తున్న మోడల్ ఫోన్ ఉందో లేదో చూసుకోవాలి. ఉన్నట్లయితే, మీ పాత ఫోన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఫోన్ స్క్రీన్, బాడీ డ్యామేజి కాలేదని దృవీకరించవలసి ఉంటుంది. అప్పుడు మీరిచ్చిన వివరాల ఆధారంగా మీ పాత ఫోన్ కు ఎంత ధర లభిస్తుందో వెబ్ సైట్ లో కనిపిస్తుంది. ఆ ధరతో మీరు సంతృప్తి చెందినట్లయితే, ‘ఓకె’ నొక్కితే మీకు ఒక డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. అప్పుడు వెబ్ సైట్ లో ప్రదర్శిస్తున్న ఎంఐ మోడల్స్ లో మీకు నచ్చిన దానిని ఎంచుకొని, మీ కూపన్ నెంబర్ ను ఎంట్రీ చేసి, మిగిలిన మొత్తాన్ని వెబ్ సైట్ లో సూచించిన విధంగా చెల్లించాలి. షియోమి ఉద్యోగి మీకు కొత్త ఫోన్ ఇచ్చి మీ పాత ఫోన్ తీసుకొంటాడు. 

ఈ పధకంలో ఒక్కసారి మాత్రమే ఫోన్ మార్చుకోవచ్చు. అదేవిధంగా మీ పాత, కొత్త ఫోన్ మార్పిడికి తప్పనిసరిగా ఒకే చిరునామా కలిగి ఉండాలి. పాత ఫోన్ ఒక చిరునామాలో కొత్తఫోన్ డెలివరీ వేరే చిరునామాలో ఇస్తే కుదరదు. ఇప్పుడు దేశంలో చాలా మంది ఎంఐ ఫోన్లకే మొగ్గు చూపుతున్నారు కానీ బాగా పనిచేస్తున్న వేరే కంపెనీ మొబైల్ ఫోన్ ఏమి చేయాలో తెలియక దానినే వాడుతున్నారు. అటువంటివారికి ఈ ఫోన్ మార్పిడి పధకం బాగానే ఉపయోగపడుతుంది. 

Related Post