దళారీ హ్యాండిచ్చాడు అందుకే...

February 22, 2018
img

ఖమ్మం జిల్లాలో ఒక టమేటో రైతు దళారిని నమ్మి మోసపోయి 60 క్వింటాళ్ళ టమేటోలను రోడ్డుపక్కన పారబోసుకొన్నాడు. జిల్లాలో ఎంకూరు మండలంలో హిమాం నగర్ కు చెందిన వెనిగండ్ల శ్రీహరి అనే రైతు ఈ ఏడాది టమేటో పంట వేశాడు. అన్నీ అనుకూలించడంతో ఈసారి మంచి దిగుబడి వచ్చింది. వాటిని మార్కెట్ కు తరలించి అమ్ముకొందామనుకొంటుండగా వైరాకు చెందిన ఒక దళారి, మొత్తం టమేటో పంటనంతా తానే తీసుకొంటానని చెప్పి ప్లాస్టిక్ ట్రేలలో నింపి సిద్దంగా ఉంచమని వెళ్ళాడు. శ్రీహరి అతను చెప్పినట్లే కూలీలను పెట్టి టమేటోలను కోయించి ప్యాక్ చేసి సిద్దంగా ఉంచాడు. కానీ టమోటోలను తీసుకువెళ్ళడానికి ఆ దళారి పత్తా లేకుండా పోయాడు. అతని కోసం శ్రీహరి మూడు రోజులు ఎదురుచూశాడు. కానీ రాలేదు. ఈలోగా ప్యాక్ చేసిన టమోటోలన్నీ మెత్తబడి కుళ్ళిపోయి నీరుగారడం మొదలయింది. ఆ స్థితిలో వాటిని మార్కెట్ కు తీసుకువెళ్ళినా అమ్ముడుపోవు కనుక ఇక చేసేదేమీ లేక 60 క్వింటాళ్ళ టమేటోలను రోడ్డుపక్కనే పారబోశాడు.


Related Post