తెలంగాణాలో విప్రో కర్మాగారం ఏర్పాటు

February 22, 2018
img

తెలంగాణా రాష్ట్రానికి మరొక పేరుమోసిన సంస్థ రాబోతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విప్రో సంస్థ తన సబ్బుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. 

హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సుకు హాజరైన ఆ సంస్థ డైరెక్టర్ రషీద్ ప్రేమ్ జీని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ కలిసి మాట్లాడగా అయన తెలంగాణాలో తమ పరిశ్రమ ఏర్పాటుకు వెంటనే అంగీకరించారు. మహేశ్వరం మండలంలో విప్రో సంస్థకు 40 ఎకరాలు కేటాయించడానికి మంత్రి కేటిఆర్ సంసిద్దత వ్యక్తం చేశారు. దానిలో రూ.220 కోట్లు పెట్టుబడితో సబ్బులు, షాంపులూ మరియు ఇతర ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని రషీద్ ప్రేమ్ జీ చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 200 మందికి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లభిస్తాయని రషీద్ ప్రేమ్ జీ చెప్పారు. ప్రభుత్వం తమకు భూమి అప్పగించి అన్ని లాంచనాలు పూర్తి చేయగానే నిర్మాణ పనులు మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఉత్పత్తి కార్యక్రమలు మొదలుపెడతామని రషీద్ ప్రేమ్ జీ చెప్పారు. రాష్ట్రంతో తమకు చిరకాలంగా అనుబంధం ఉందని మున్ముందు ఐటి రంగంలో కూడా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని రషీద్ ప్రేమ్ జీ చెప్పారు. 

           


Related Post