బి.ఎస్.ఎన్.ఎల్. సవాలును జియో తట్టుకోగలదా?

February 15, 2018
img

జియో దెబ్బకు దేశంలో అన్ని టెలికాం కంపెనీలు విలవిలలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా విశాలమైన నెట్ వర్క్, వేలాది మంది సిబ్బంది, వేలాది కార్యాలయాలు కలిగి ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్. కూడా జియో దెబ్బకు విలవిలలాడుతోంది. అయితే దేశంలో అదొక్కటే బలమైన నెట్ వర్క్ కలిగిన కంపెనీ కనుక జియో దెబ్బను కాసుకొంటూ దానికి సవాలు విసరగలుగుతోంది. 

రూ.1,500 ఖరీదు చేసే జియో 4జి ఫీచర్ ఫోన్ తో కేవలం రూ.49కే 28 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్, 1జిబి డేటా కూడా అందిస్తుండటంతో జియో వైపు వెళ్ళిపోతున్న తన వినియోగదారులను కాపాడుకొనేందుకు బి.ఎస్.ఎన్.ఎల్. చాలా బారీ ప్లాన్ ప్రకటించింది. 

జియోతో సహా అన్ని టెలికాం కంపెనీలు మూడు నెలలు కాలపరిమితిగల ప్లాన్స్ ప్రకటిస్తుంటే, బి.ఎస్.ఎన్.ఎల్. ఏకంగా ‘ఏడాది ప్లాన్’ ప్రకటించింది. నేటి నుంచి అమలులోకి రాబోతున్న ఆ సరికొత్త ప్లాన్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి. 

ప్లాన్ వాల్యూ: రూ.999        

కాలపరిమితి: 365 రోజులు.

అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్: 180 రోజులపాటు లభిస్తాయి. (ఆ తరువాత నిమిషానికి 60 పైసలు చార్జీ వసూలు చేయబడుతుంది.) 

డేటా: రోజుకు 1 జిబి చొప్పున 365 రోజులు. 1 జిబి పరిమితి దాటినా తరువాత 40 కెపిబిఎస్ స్పీడ్ తో అపరిమిత డేటా.

ఎస్.ఎం.ఎస్ లు: రోజుకు 100 చొప్పున 180 రోజులు. ఆ తరువాత లోకల్ నెట్ వర్క్ లో ఒక్కో ఎస్ఎంఎస్ కు 25 పైసలు, జాతీయ స్థాయిలో ఒక్కో మెసేజుకు 35 పైసలు చార్జీలు ఉంటాయి. 

మినహాయింపులు: 

ఈ ప్లాన్ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు వర్తించదు. ముంబాయి, డిల్లీ సర్కిల్స్ కు ఉచిత వాయిస్ కాల్స్ చేసుకొనే వెసులుబాటు లేదు...రోమింగ్ సౌకర్యం కూడా లేదు. ఆ రెండు సర్కిల్స్ లో నిమిషానికి 60 పైసలు చార్జీ వసూలు చేయబడుతుంది.

Related Post