రెడ్ మి నోట్-5 వచ్చేసింది

February 14, 2018
img

ఒకప్పుడు దేశంలో నోకియా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా అమ్ముడయ్యేవి. శాంసంగ్ వచ్చిన తరువాత నోకియా వెనుకబడిపోయింది. ఇప్పుడు రెడ్ మి ఫోన్లు వచ్చేక శాంసంగ్ ను వెనక్కుపోయింది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా రెడ్ మి ఫోన్లే కనిపిస్తున్నాయి. ఇతర మొబైల్ ఫోన్ల కంటే అత్యాధునిక ఫీచర్స్ కలిగి, వాటి కంటే చాలా తక్కువ ధరకే లభిస్తున్న కారణంగా రెడ్ మి ఫోన్లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. 

ఇదివరకు ప్రవేశపెట్టిన రెడ్ మి నోట్-4 వెర్షన్ కు కొనసాగింపుగా మరింత ఆధునిక ఫీచర్స్ తో రెడ్ మి నోట్-5, రెడ్ మి నోట్-5ప్రో అనే రెండు సరికొత్త మోడల్స్ ను బుధవారం డిల్లీలో విడుదల చేసాఋ ఆ సంస్థ డైరెక్టర్ మను కుమార్ జైన్. వాటి ధరలు, వివరాలు:

రెడ్ మి నోట్-5: 

స్క్రీన్: 5.99 అంగుళాలు (ఫుల్ హెచ్.డి.), ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636, రామ్: 3జిబి, బిల్టిన్ స్టోరేజ్: 32 జిబి, బ్యాటరీ: 4,100 ఎం.ఏ.హెచ్., ఫ్రంట్ కెమెరా: 5, రియర్ కెమెరా: 16 మెగా పిక్సెల్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వగైరా ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర: రూ. రూ.9,999. ఇదే మోడల్ లో 4జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర: 11,999. 

రెడ్ మి నోట్-5 ప్రో:

 స్క్రీన్: 5.99 అంగుళాలు (ఫుల్ హెచ్.డి.), ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636, రామ్: 6జిబి, బిల్టిన్ మెమొరీ స్టోరేజ్: 64 జిబి, బ్యాటరీ: 4,100 ఎం.ఏ.హెచ్., దీనిలో వెనుక వైపు 12, 5 మెగా పిక్సెల్స్ సామర్ధ్యం కలిగిన రెండు కెమెరాలను ఏర్పాటు చేసింది. ఫ్రంట్ కెమెరా: 20 మెగా పిక్సెల్స్. ఈ ఫోన్ లో ఫేస్-అన్ లాక్ ఫీచర్ ఏర్పాటు చేసింది. వినియోగదారుడి మొహాన్ని గుర్తించి ఫోన్ అన్ లాక్ అవుతుందన్న మాట! దీని ధర: రూ. రూ.16,999. ఇదే మోడల్ లో 4జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర: 13,999. 

ఈ రెండు మోడల్ ఫోన్లకు వచ్చే వారం నుంచి ఎంఐ, ఫ్లిప్ కార్ట్ ఆన్-లైన్ స్టోర్స్  లో ఫ్లాష్ సెల్ నిర్వహిస్తామని ఆ తరువాత మిగిలిన అన్ని ఆన్-లైన్, మరియు ఆఫ్- లైన్ స్టోర్స్ లలో విక్రయిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు.

రెడ్ మి ఫోన్లతోనే దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఆ సంస్థ వీటితో బాటు మొట్టమొదటి సారిగా ఎం.ఐ-4 టీవీని కూడా నిన్న డిల్లీలో ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న అన్ని ఎల్.ఈ.డి.టీవీల కంటే ఇది పలుచగా ఉంటుందని మను కుమార్ జైన్ తెలిపారు. దీని ధర రూ.39,999 గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ టీవి కొనుగోలు చేసినవారికి హాట్ స్టార్, వూట్, సోనీ లైవ్, హంగామా ప్లే, జి-5, సం నెక్స్ట్, వియు, టి.వి.ఎఫ్. ప్లిక్ స్ట్రీ మొదలైన స్ట్రీమింగ్ ఛానల్స్ 5 లక్షల గంటలు కంటెంట్ 80 శాతం ఉచితంగా అందించబోతున్నట్లు తెలిపారు. దీనితో బాటు వస్తున్న రిమోట్ లో కేవలం 11 బటన్లు మాత్రమే ఉంటాయి.

Related Post