జియో ఫైబర్ వచ్చేస్తోంది...ట!

February 13, 2018
img

దేశంలో జియో ఫోన్ సృష్టించిన సంచలనం లేదా టెలికాం రంగంలో చేస్తున్న విద్వంసాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. త్వరలో జియో ఫైబర్ నెట్ కూడా వస్తోంది. ఇప్పటికే 10 నగరాలలో దానిని ప్రయోగాత్మకంగా అందిస్తోంది. మరొక నెలలో దీనిని మరో ఆరు నగరాలలో అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. జియో ఫైబర్ బేసిక్ ప్యాక్ లో రూ.500 కే 600 జిబి డేటా 100 ఎంబిపిఎస్ స్పీడుతో అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇతర సంస్థలు ఆ ధరకు గరిష్టంగా 100 జిబి 40-50 ఎంబిపిఎస్ స్పీడుతో అందిస్తున్నాయి. కనుక జియో ఫైబర్ ఎంట్రీ ఇవ్వగానే ఆ రంగంలో కూడా పోటీ పెరిగి అన్ని సంస్థలు ధరలు తగ్గించకతప్పదు. జియోతో పోటీ పడలేని చిన్నా చితకా సంస్థలు మూతపడక తప్పదు. దీనితో జియో డిటిహెచ్ (టీవీ ఛానల్స్) సర్వీసులు కూడా అందించబోతున్నట్లు సమాచారం. అంటే ఆ రంగంలో కూడా పోటీ మొదలవబోతోందన్న మాట!         


Related Post