కూకట్ పల్లిలో విదేశీ సంస్థ కార్యాలయం ఏర్పాటు

February 10, 2018
img

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం సరళమైన టిఎస్ ఐ-పాస్ అమలులోకి తెచ్చినప్పటి నుంచి దేశవిదేశాలకు చెందిన అనేక సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇంతవరకు 6,000 కు పైగా సంస్థలు, పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వడంతో రూ.1.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వాటిద్వారా రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక వేలమందికి ఉపాధి లాభించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ చెప్పారు.  

రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యాపారసంస్థలను ఆకర్షించడానికి తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని దృవీకరిస్తూ అబుదాబీకి చెందిన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ అనే సంస్థకు చెందిన ఎన్.పి.సి.సి. అనే డిజైన్ ఇంజనీరింగ్ సంస్థ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో గల మంజీరా ట్రినిటీ కార్పోరేట్ బిల్డింగ్ లో అనివా, నెల్ అనే మరో రెండు సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకొంది, రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికోసం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు.

Related Post