ఆదివారం ఉచిత సేవలు బంద్

January 18, 2018
img

బి.ఎస్.ఎన్.ఎల్. లాండ్ లైన్ వినియోగదారులను పెంచుకోవడానికి 2016లో ప్రకటించిన ‘ఫ్రీడం’ ఆఫర్ కు చిన్న కత్తెర్లు వేసింది. ఇంతవరకు ఆదివారంనాడు రోజంతా ఏ నెట్ వర్క్ కయినా ఉచితంగా మాట్లాడుకొనే సౌకర్యం ఉండేది. దానిని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఉచిత కాల్స్ సమయాన్ని రాత్రి 10.30 గంటల నుంచి ఉద‌యం 6 గంటలకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 

లాండ్ లైన్ వినియోగదారుల ఉచిత సౌకర్యాలకు కత్తెర వేసిన బి.ఎస్.ఎన్.ఎల్. ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం చాలా ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రపకటించింది. రూ187,429,666 విలువగల మూడు ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్స్  ప్రకటించింది.     

28 రోజులు కాలపరిమితి కలిగిన రూ187 ప్లాన్ లో అపరిమిత కాల్స్, రోజుకు 1 జిబి డేటా-3జితో అందిస్తోంది.

81 రోజులు కాలపరిమితి కలిగిన రూ429 ప్లాన్ లో అపరిమిత కాల్స్, రోజుకు 1 జిబి డేటా-3జితో అందిస్తోంది.

129 రోజులు కాలపరిమితి కలిగిన రూ666 ప్లాన్ లో అపరిమిత కాల్స్, రోజుకు 1.5 జిబి డేటా-3జితో అందిస్తోంది. 

జియో తదితర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఇంచుమించు ఇటువంటి ప్లాన్స్ అందిస్తున్నప్పటికీ అవన్నీ 4జిలో అందిస్తున్నాయి. వాటిని పొందాలంటే తప్పనిసరిగా 4జి సౌకర్యం ఉన్న మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. కానీ బి.ఎస్.ఎన్.ఎల్. అందిస్తున్న ఈ ప్లాన్స్ 3జి సౌకర్యం ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా పనిచేస్తాయి. పైగా ప్రైవేట్ టెలికాం కంపెనీలలో కాల్ డ్రాప్స్ ఎక్కువ. కనుక సామాన్య ప్రజలకు బి.ఎస్.ఎన్.ఎల్. అందిస్తున్న ఈ ఆఫర్లు ఎక్కువ ఉపయోగకరంగా ఉండవచ్చు. 

Related Post