బాలకృష్ణుడు తగ్గేశాడుగా..!

September 23, 2017


img

నారా రోహిత్ హీరోగ పవన్ మల్లెల డైరక్షన్ లో వస్తున్న సినిమా బాలకృష్ణుడు. ఈ సినిమాలో ఓ కొత్త రోహిత్ ను చూస్తారని అనిపిస్తుంది. కెరియర్ లో ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ ఈమధ్య కొద్దిగా లావు పెరిగాడని తెలిసిందే. అయితే ఇప్పుడు రోహిత్ స్లిం లుక్ లో మాత్రం అదరగొడుతున్నాడు. రమ్యకృష్ణ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.


ఇక ఈరోజు రిలీజ్ చేసిన సినిమా సెకండ్ లుక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. దసరాకు సినిమా టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. శమంతకమణి సినిమాలో పోలీస్ గా నటించి మెప్పించిన రోహిత్ కథలో రాజకుమారితో అలరించలేకపోయాడు. మరి ఈ బాలకృష్ణుడు అయినా సరే నారా రోహిత్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. విజనరి మోషన్స్, మాయాబజార్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మిస్తుండగా సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.    



Related Post

సినిమా స‌మీక్ష