అదే సెంటిమెంట్ తో రాజు గాది గది-2..!

July 25, 2017


img

ఓంకార్ డైరక్షన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా రాజు గారి గది. చిన్న బడ్జెట్ తో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సీక్వల్ గా ఓంకార్ మరో సినిమా శ్రీకారం చుట్టారు. సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్ లతో పాటుగా కింగ్ నాగార్జున ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు మేకర్స్. రాజు గారి గది కూడా అక్టోబర్ లోనే రిలీజ్ అయ్యింది ఆ సెంటిమెంట్ తో ఈ సీక్వల్ కూడా అక్టోబర్ లోనే తీసుకొస్తున్నామని అన్నారు దర్శక నిర్మాతలు. రీషూట్స్ కూడా చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మొదటి పార్ట్ లానే అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు. మరి రాజు గారి గది-2 ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష