లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

July 03, 2020


img

బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు.. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ లో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో 4 దశాబ్ధాలుగా కొరియోగ్రాఫ్ చేస్తూ సరోజ్ ఖాన్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్ లో కొత్త డ్యాన్స్ ను కంపోజ్ చేసిన ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలను కంపోజ్ చేయడం జరిగింది. 

స్టార్ హీరోలు కూడా ఆమె కొరియోగ్రాఫీకి ఫ్యాన్స్ గా మారారని చెప్పొచ్చు. కెరియర్ లో 2 వేలకు పైగా సాంగ్స్ కంపోజ్ చేసిన సరోజ్ కాని 3 సార్లు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఆమె కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లో ఎన్నో సూపర్ హిట్ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ హెల్త్ సహకరించకపోవడం వల్ల ఈమధ్య సినిమాలను పూర్తిగా తగ్గించేశారు. చివరగా ఆమె మణికర్నిక సినిమాకు వర్క్ చేశారు.  



Related Post

సినిమా స‌మీక్ష