త్రివిక్రంతోనే తారక్..!

May 20, 2019


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ చేసే సినిమాపై క్లారిటీ లేదు కాని ఈరోజు తారక్ బర్త్ డే సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ వారు పోస్టర్ వదిలారు. తారక్ కు బర్త్ డే విశెష్ అందిస్తూ రిటెన్ అండ్ డైరక్టర్ త్రివిక్రం అని పెట్టారు. అంటే తారక్ తర్వాత సినిమా త్రివిక్రం తోనే అని ఫిక్స్ అవ్వొచ్చు. 2020 జనవరి ఎండింగ్ వరకు ఆర్.ఆర్.ఆర్ బిజీతోనే ఉంటాడు ఎన్.టి.ఆర్.

ప్రస్తుతం త్రివిక్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో బన్ని సినిమా పూర్తయ్యే టైం కు ట్రిపుల్ ఆర్ నుండి తారక్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఆల్రెడీ తారక్ తో త్రివిక్రం అరవింద సమేత సినిమా చేశాడు. మరి రెండో సినిమా ఎలాంటి కథతో వస్తారో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష