సావిత్రి పాత్రలో నిత్యా మీనన్

September 22, 2018


img

మహానటి సినిమా చూశాక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అసలు ఆ పాత్రకు ముందు అనుకున్న నిత్యా మీనన్ చివరి నిమిషంలో చేయనని చెప్పడంతో ఆమె బదులుగా కీర్తి సురేష్ చేసింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎంత గొప్ప నటి అన్నది ప్రూవ్ అయ్యింది. అయితే మరోసారి సావిత్రి పాత్రలో కనిపించే అర్హత సంపాదించింది నిత్యా మీనన్.

అదెలా అంటారా.. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సావిత్రిగా కీర్తి సురేష్ కాదన్నదో ఏమో కాని నిత్యా మీనన్ ఆ రోల్ చేస్తుందని అంటున్నారు. మాయాబజార్, రక్తసంబంధం, మిస్సమ్మ వంటి సినిమాల్లో ఎన్.టి.ఆర్ తో పాటుగా సావిత్రిని చూపిస్తారట. నిత్యా మీనన్ కూడా సావిత్రిగా అలరిస్తుందని ఆశిస్తున్నా అభిమానులు. ఈమధ్యనే చంద్రబాబుగా రానా, ఏయన్నార్ గా సుమంత్ అదిరిపోయేలా కనిపించగా మహానటి సావిత్రిగా నిత్యా మీనన్ ఎలా ఉంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష