అఖిల్ స్పీడ్ పెంచేశాడు..!

July 20, 2018


img

అక్కినేని అఖిల్ 3వ సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తుందని తెలిసిందే. ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడ షెడ్యూల్ త్వరలోనే పూర్తి చేసుబోతుందట. అఖిల్, హలో సినిమాల విషయంలో అతి జాగ్రత్తలే కొంపముంచాయని గుర్తించిన అఖిల్ ఇక నుండి సినిమా కథల మీద దృష్టి పెడుతున్నాడు. మొదటి రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ 3వ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తర్వాత సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ సత్య ప్రభాస్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆది పినిశెట్టి సోదరుడైన సత్య ప్రభాస్ తమ్ముడితో మలుపు సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక ఈమధ్యనే అఖిల్ ను కలిసి లైన్ చెప్పాడట. లైన్ నచ్చిన అఖిల్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమని చెప్పాడట. మొదటి రెండు సినిమాల వల్ల దెబ్బ తిన్న అఖిల్ ఇప్పుడు స్పీడ్ పెంచాడని తెలుస్తుంది. ఇక తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్ తో కూడా క్రేజీ లవ్ స్టోరీ తీస్తున్నాడట. చూస్తుంటే అఖిల్ 3వ సినిమా హిట్ కొట్టేలానే ఉన్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష