ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ రెస్పాన్స్..!

July 19, 2018


img

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత గాథతో సినిమా తలపెట్టాడు ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్క్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ విషయంపై రోజుకో చర్చ జరుగుతుంది. చంద్రబాబుగా రానా, ఏయన్నార్ గా సుమంత్, కృష్ణ పాత్రలో మహేష్ నటిస్తున్నారని వార్తలొచ్చాయి. రెండు రోజుల నుండి ఈ బయోపిక్ నుండి శర్వానంద్ తప్పుకున్నాడని టాక్.

యుక్తవయసులో ఎన్.టి.ఆర్ పాత్రలో శర్వా కనిపిస్తున్నాడని అన్నారు. కాని ఫైనల్ గా అతను ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడట. అయితే మీడియాలో చెబుతున్న పాత్రలు పాత్రదారులు ఎవరు ఫైనల్ కాదని షాక్ ఇచ్చాడు క్రిష్. సినిమాలో కాస్టింగ్ విషయమై అఫిషియల్ ప్రకటన ఇస్తామని. ఎవరున్నారు ఎవరు లేరు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని వివరణ ఇచ్చారు క్రిష్. సంక్రాంతికి ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న క్రిష్ డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని చూస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష