యాత్ర మమ్ముట్టీ ఎంట్రీ అదిరింది..!

June 23, 2018


img

వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న యాత్ర మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. వైఎస్ పాలిటికల్ కెరియర్లో అత్యంత కీలకమైన పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. అందుకే సినిమా టైటిల్ కు యాత్ర అని పెట్టారు. ఇక సినిమాలో వైఎస్సార్ గా మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. జూన్ 20 నుండి ఈ సినిమాకు సంబందించిన పాదయాత్ర ఎపిసోడ్ సీన్స్ షూట్ చేస్తున్నారట.  

దీనికి సంబందించి మమ్ముట్టీ ఎంట్రీని షూట్ చేసి ఓ సర్ ప్రైజ్ వీడియో వదిలారు చిత్రయూనిట్. ఈమధ్య వచ్చిన మహానటి సినిమా బయోపిక్ సినిమాలకు ఓ కొత్త అర్ధం చెప్పింది. ఇక మరో పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా సెట్స్ మీద ఉంది. వైఎస్సార్ బయోపిక్ కూడా అంతే ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతుంది. పాదయాత్ర సమయంలో జరిగిన ప్రతి విషయం ఈ సినిమాలో ప్రస్థావిస్తారని తెలుస్తుంది.     





Related Post

సినిమా స‌మీక్ష