అర్జున్ రెడ్డికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్..!

June 17, 2018


img

సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించిన ఆ సినిమా అతనికి ఎంతో క్రేజ్, పాపులారిటీ తెచ్చిపెట్టింది. అంతేకాదు 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా తెచ్చింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు.

స్టార్స్ హీరోలను దాటేసి అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ దేవరకొండ ఈ అవార్డ్ అందుకోవడం విశేషం. 4 కోట్లతో తీసిన అర్జున్ రెడ్డి సినిమా 40 కోట్లపైగా వసూళ్లను రాబట్టింది. సినిమాలో విజయ్ కు జోడీగా షాలిని పాండే నటించింది. అంతకుముందు పెళ్లిచూపులు సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. కెరియర్ లో తీసిన 4 సినిమాల్లోనే ఫిల్మ్ ఫేర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని కోరుకుందాం. 



Related Post

సినిమా స‌మీక్ష