ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ క్విట్..!

April 25, 2018


img

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన డైరక్టర్ తేజ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఎన్.టి.ఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. సీనియర్ దర్శకుడు కావాలన్న ఆలోచనతో తేజకు ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు బాలకృష్ణ. ముందు ఓకే అన్నా తర్వాత సినిమా మీద ఏర్పడిన అంచనాలు.. ఒకవేళ సినిమా అటుఇటైతే వచ్చే ఆరోపణలను ఊహించిన తేజ ఓ 10 రోజుల నుండి సినిమా చేయలేనని చెప్పుకుంటూ వస్తున్నాడట.

బాలకృష్ణ మాత్రం తేజని కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడట. రెండు రోజుల క్రితం ఇక ససేమీరా అన్న తేజని ఓకే మీ ఇష్టం అని చెప్పాడట బాలకృష్ణ. ఈరోజు మధ్యాహ్నం కూడా తేజతో చర్చలు జరిపాడట బాలకృష్ణ. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. పని ఒత్తిడితో పాటుగా సినిమా అంచనాలను అందుకునేలా తీయడం తనకు కష్టమని చేతులు ఎత్తేశాడట తేజ. 

అదిగాక సినిమా కథ మొత్తం బాలకృష్ణ అజ్ఞానుసారాల మీదనే జరిగింది. సెట్స్ కు వచ్చి టేక్, యాక్షన్ తప్ప మిగతా అంతా నడిపించేది బాలయ్య బాబే. అయితే బయట మాత్రం బాధ్యత తన మీద ఉంటుందని తెలిసి ఫైనల్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ తన వల్ల కాదని చెప్పేశాడట తేజ. తేజ సడెన్ షాక్ తో బాలకృష్ణ డైలమాలో పడిన పరిస్థితి ఏర్పడింది.



Related Post

సినిమా స‌మీక్ష