సూర్య హిట్ అయితే వెంటనే ఛాన్స్..!

April 24, 2018


img

రచయితగా ఎన్నో సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి చేస్తున్న మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ఆడియోలో నా మూడున్నర ఏళ్ల కల తీర్చిన మగాడు అల్లు అర్జున్ అంటూ సౌండ్ పెంచిన వక్కంతం ఇండైరెక్ట్ గా ఎన్.టి.ఆర్ మీద సెటైర్ వేశాడని అంటున్నారు.

ఇక నా పేరు సూర్య రిలీజ్ కాకముందే మరో రెండు కథలను సిద్ధం చేశాడట. అవి కూడా మెగా హీరోలతోనే ఉంటాయని చెబుతున్నారు. మెగా హీరోల్లో తేజు, వరుణ్ తేజ్ ఇద్దరు తమ స్టైల్ కు తగినట్టు సినిమాలు చేస్తున్నారు. వారితో సినిమా చేస్తాడట వక్కంతం వంశీ. అయితే వారు చేయాలంటే మాత్రం ముందు సూర్యతో హిట్ కొట్టాల్సిందే. బన్ని సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఛాన్స్ మిస్ అయినట్టే.



Related Post

సినిమా స‌మీక్ష