ప్రముఖ ఎడిటర్ అనీల్ మల్నాడ్ కన్నుమూత..!

March 20, 2018


img

ప్రముఖ ఎడిటర్ అనీల్ మల్నాడ్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనీల్ మల్నాడ్ కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స చేసుకుంటున్న అనీల్ ఈరోజు ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మంత్రిగారి వియ్యంకుడు సినిమాతో తొలి సినిమా ఎడిటింగ్ చేసిన అనీల్ దాదాపు 200 పైగా సినిమాలను ఎడిట్ చేశారు.

తెలుగు, తమిళ, హింది, కన్నడ, మలయాళం మొత్తం 9 భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ చేశారు అనీల్ మల్నాడ్. సితార సినిమాకు గాను ఆయన నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అనీల్ మల్నాడ్ మరణంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కర్ణాటకలోని చిక్ మగళూరు ప్రాంత్రం నుండి వచ్చిన అనీల్ బాపు దగ్గర సహాయనికునిగా చేశారు. బాపు దగ్గర 22 సినిమాలకు ఎడిటింగ్ చేశారు అనీల్.



Related Post

సినిమా స‌మీక్ష